వరంగల్ కి పత్తి పరిశోధన కేంద్రం..
మంజూరు చేస్తూ ఐసీఏఆర్ లేఖ..
ఆదిలాబాద్ లో మరోటి..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో రెండు అఖిల భారత పత్తి పరిశోధన సమన్వయ కేంద్రాలకు (ఏఐసీఆర్ పీ) భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ఐసీఏఆర్.. జయశంకర్ యూనివర్సిటీ ఉప కులపతికి అధికారికంగా లేఖ రాసింది. నూతనంగా నియమితులైన ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య గత నెలలో ఢిల్లీలోని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.టి.పి శర్మలను కలిశారు.
అఖిల భారత పత్తి సమన్వయ పరిశోధన పరిశోధన పథకంలో యూనివర్సిటీకి భాగస్వామ్యం కల్పించి… వరంగల్‌లో ప్రధాన కేంద్రం, ఆదిలాబాద్‌లో ఒక ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ విజ్ఞప్తికి ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించి కేంద్రాలను వెంటనే మంజూరు చేస్తున్నట్లు గురువారం ఉప కులపతికి లేఖను పంపించారు.
Recent Comments