స్పాట్ వాయిస్, వరంగల్: జిల్లాలో కరోనా మరణం కలకలం రేపింది. ఖానాపురం మండలం యాపచెట్టు పంచాయతీ పరిధిలోని కోమటిపల్లి తండాకు చెందిన యువకుడు ఇస్లావత్ మురళీ కరోనాతో మృతి చెందారు. మురళీ నాలుగు రోజుల క్రితం జ్వరం , జలుబుతో బాధపడ్డాడు. మంగళవారం పరిస్థితి విషమించడంతో వరంగల్లోని రోహిణీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మురళీ మృతి చెందాడు. మురళీ మృతితో ఓరుగల్లు లో మళ్లీ కరోనా భయం నెలకొంది.
పెరుగుతున్న కోవిడ్ కేసులు..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. మంగళవారం మొత్తం 36,619 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 813 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,703 కరోనా యాక్టివ్ కేసులున్నట్టు అధికారులు తెలిపారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 343 కరోనా కేసులు నమోదయ్యాయి.
Recent Comments