Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్కరోనా కొత్త వేరియంట్ ..బీఏ 2.75 గుర్తింపు

కరోనా కొత్త వేరియంట్ ..బీఏ 2.75 గుర్తింపు

వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ
స్పాట్ వాయిస్, బ్యూరో: కరోనా కొత్త వేరియంట్ వెలుగుచూసింది. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త సబ్ వేరియంట్ బీఏ 2.75 ఇండియాలో కనుగొన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అయితే ఈ వైరస్ లక్షణాలను పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. యూరప్, అమెరికాలో, బీఏ -4, బీఏ-5 వేరియంట్లతో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ప్రకటించారు. రెండు వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు 30 శాతం మేర పెరిగాయని టెడ్రోస్ తెలిపారు. డబ్ల్యూహెచ్ఓకు చెందిన ఆరు సబ్ రీజియన్లలో నాలుగు చోట్ల కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఒమిక్రాన్ సబ్ వేరియింట్ బీఏBA.2.75 వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. బీఏ 2.75 అని పిలవబడే ఈ ఉప-వేరియంట్ మొదటగా భారత్లో గుర్తించామని తెలిపారు. భారత్తో పాటు మరో 10 దేశాల్లోనూ బీఏ 2.75 వైరస్ గుర్తించినట్లు వెల్లడించారు. అయితే వైరస్ వల్ల రోగనిరోధక శక్తికి ఏ మేరకు ఇబ్బంది కలిగిస్తుంది.., మనిషిపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి మరింత సమయం పట్టవచ్చని తెలిపారు. వైరస్ను డబ్ల్యూహెచ్ఓ నిత్యం ట్రాక్ చేస్తోందని ఎస్ ఏఆర్ఎస్-CoV-2 వైరస్ ఎవల్యూషన్పై డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం నిరంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను చూస్తోందన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో బీఏ 5 , బీఏ 4 వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఏ 5 ఉపవేరియంట్ ను 83 దేశాలలో కనుగొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments