Saturday, September 21, 2024
Homeతెలంగాణపెరుగుతున్న కరోనా ఉధృతి

పెరుగుతున్న కరోనా ఉధృతి

నిన్న 494, ఈ రోజు 493
ఏ జిల్లాల్లో ఎన్ని కేసులంటే..?
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కరోనా మళ్లీ ఉధృతరూపం దాలుస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరోసారి నిబంధనలు తీసుకొచ్చింది. గురువారం 494 కేసులు నమోదు కాగా.. శుక్రవారం 493 కేసులు రికార్డు అయినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెంలో 07, హైదరాబాద్ లో 366, కరీంనగర్ 01, ఖమ్మం 07, మహబూబాబాద్ 04, మేడ్చల్ మల్కాజ్ గిరి 34, ములుగు 01, నాగర్ కర్నూలు 02, నిజామాబాద్ 07, పెద్దపల్లి 02, రాజన్న సిరిసిల్ల 01, రంగారెడ్డి 40, సంగారెడ్డి 07, సూర్యాపేట 01, వికారాబాద్ 02, వరంగల్ 01, హన్మకొండ 08, యాదాద్రి భువనగిరిలో 02 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments