Saturday, April 5, 2025
Homeలేటెస్ట్ న్యూస్రాష్ట్రంలో పెరిగిన కరోనా కేసులు

రాష్ట్రంలో పెరిగిన కరోనా కేసులు

స్పాట్ వాయిస్‌ , హైదరాబాద్: తెలంగాణ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 26,704 మంది నమూనాలు పరీక్షించగా… కొత్తగా 403 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గత వారంతో పోలిస్తే ఈ రోజు రెట్టింపు కేసులు నమోదైనట్లు పేర్కొంది. ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధలు పాటించాలని పేర్కొంది. రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌, భౌతికదూరం తప్పనిసరని వెల్లడించింది. జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments