స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణ ప్రజల కోసం అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అత్యవసరమైతే.. కంట్రోల్ రూమ్ నెంబర్ 9121306007 కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రజలందరూ భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సూచించినారు . ఏదైనా సమస్య ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ కి కాల్ చేయాలన్నారు.
Recent Comments