ఎస్సీ, ఎస్టీ స్థానాలు పెంచాలి
సీఎం కీలక సూచన
స్పాట్ వాయిస్, బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. గురువారం సభలో సీఎం రేవంత్ రెడ్డి డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకుండా డీలిమిటేషన్ చేయడం సరికాదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలనే కొనసాగించాలని వెల్లడించారు. అయితే.. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. వాటి సంఖ్యను 153కు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అంతేకాకుండా.. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయడానికి డీలిమిటేషన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్మానానికి పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Recent Comments