Sunday, November 24, 2024
Homeతెలంగాణకాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తులేనట్లేనా.. !

కాంగ్రెస్-టీఆర్ఎస్ పొత్తులేనట్లేనా.. !

హాట్ టాపిక్ గా మారిన పీకే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
స్పాట్ వాయిస్, డెస్క్: తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఇప్పుడు చర్చగా మారింది. ఇన్నాళ్లు టీఆర్ఎస్ కు మద్దతుగా తెలంగాణలో పర్యటించిన పీకే.. ఇప్పుడు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన తెలుగు రాష్ర్టాల్లో చేసిన రహస్య సర్వేలో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ కు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఇటీవల ఆయన కాంగ్రెస్‌ అధిష్టానానికి ఎన్నికల వ్యూహంపై ఇచ్చిన పవర్‌ పాయింట్‌  ప్రజెంటేషన్‌ లీక్ అయింది. దీంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అనుసరించాల్సి వ్యూహంపై పీకే కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఒంటరిగా వెళ్లడమే కరెక్టనే అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పునరుత్థానానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారు. అలాగే పార్టీలోనూ అనేక మార్పులు చేయాలని, పార్టీలో ‘ఒక వ్యక్తి – ఒకే పదవి’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments