Friday, September 20, 2024
Homeతెలంగాణనిన్న కాంగ్రెస్..నేడు బీఆర్ఎస్

నిన్న కాంగ్రెస్..నేడు బీఆర్ఎస్

ఎమ్మెల్యే వాపస్..!
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ తో హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారా.. అంటే ఈ ఘటన అవుననే చెబుతోంది. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వీలీనం మాట అటుంచి ఏకంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలే తిరిగి భారత రాష్ట్ర సమితి గూటికొస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తేనేటి విందును స్వీకరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ కూడా ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి ఘర్ వాపసీ అయినట్టు అధికారికంగా ధృవీకరించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త కలవరం మొదలైందనే చెప్పాలి. ఇప్పటికీ ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ ట్విస్ట్ ఆసక్తరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments