జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక రద్దు
రోడ్డున పడిన కాంగ్రెస్ లొల్లి
స్పాట్ వాయిస్, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో కల్లోలం చెలరేగింది. డీసీసీ జనగామ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపిస్తూ.. అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక రద్దు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలో పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలు చేయడంపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నానని తనకు తానే జంగా రాఘవరెడ్డి ప్రకటించుకోవడంతో వివాదం తెరపైకి వచ్చిo ది. ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసి, పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.
Recent Comments