వీరికి ఖరారైనట్లేనని ప్రచారం
పెండింగ్‌లో మరో ఆరు నియోజకవర్గాలు
స్పాట్ వాయిస్, బ్యూరో: అధికార జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ప్రకటించాల్సిన 13 స్థానాల్లో ఆరు స్థానాలకు సంబంధించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియాగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీవేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన సీఈసీ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ పాల్గొన్నారు.
ఏడు స్థానాలపై చర్చ..
సీఈసీ సమావేశంలో ఏడు లోక్‌సభ స్థానాలపై చర్చ జరిగింది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి స్థానం నుంచి గడ్డం వంశీ, చేవెళ్లకు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరికి సునీతారెడ్డి, నాగర్‌కర్నూల్‌కు పార్టీ సీనియర్ నేత మల్లు రవి, ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్‌కు ఖైరతాబాద్ ఎమ్మె్ల్యేగా ఉన్న దానం నాగేందర్ పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం
ఆరు పెండింగ్ లో
హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నియోజకవర్గాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ ప్రాంతాల నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఫ్లాష్ సర్వేల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ రెండో జాబితా..!
RELATED ARTICLES
Recent Comments