మహిళలకు వరాల జల్లు..
రైతులకు, కూలీలకు సాయం..
స్పాట్ వాయిస్, బ్యూరో: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీ గ్యారెంటీ హామీలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ హామీలను సభ వేదికగా తెలంగాణ ప్రజలకు వివరించారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారమే టార్గెట్ గా దూసుకెళ్తున్న కాంగ్రెస్ మహిళా ఓటర్లే టార్గెట్ గా మెజారిటీ హామీలు ప్రకటించింది.
కాంగ్రెస్ గ్యారెంటీస్..
*మహాలక్ష్మీ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం
*రూ.500 లకే గ్యాస్ సిలిండర్
*ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం
*ఇళ్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం
*ఉద్యమకారుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం
*రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం
*వ్యవసాయం కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం.
*వరి పంటకు క్వింటాల్ కు రూ.500 బోనస్
*గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
*చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్
* రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
Recent Comments