మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్ గా చల్లా వంశీచంద్ రెడ్డి
50 వేల మెజార్టీతో గెలిపించాలని శ్రేణలకు పిలుపు
స్పాట్ వాయిస్, బ్యూరో : త్వరలో జరిగే వచ్చే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో టీపీసీసీ చీఫ్ ఈ మేరకు ప్రకటన చేశారు. వంశీచందర్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా సీఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, గత నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను.. అన్నింటినీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థానాన్ని వంశీచందర్ రెడ్డి సునాయాసంగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో సౌమ్యుడిగా మంచి పేరున్న వంశీచందర్ రెడ్డి పార్టీ అధినేతలు సోనియా, రాహుల్, ఖర్గేలతో కూడా మంచి సంబంధాలున్నాయి.
కాంగ్రెస్ తొలి ఎంపీ అభ్యర్థి ప్రకటన
RELATED ARTICLES
Recent Comments