Sunday, November 24, 2024
Homeజాతీయంకాంగ్రెస్‌ కమిటీలకు 13 మంది రాజీనామా

కాంగ్రెస్‌ కమిటీలకు 13 మంది రాజీనామా

టీ పీసీసీలో తారా స్థాయికి సంక్షోభం..

**కాంగ్రెస్‌ కమిటీలకు 13 మంది సభ్యుల రాజీనామా..!*

**నష్ట నివారణ చర్యలు చేపట్టిన అధిష్ఠానం*

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీలపై ముదిరిన సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని సీనియర్‌ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచి వచ్చిన 13 మంది నేతలు కాంగ్రెస్‌ కమిటీలకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, విజయరామారావు, చారగొండ వెంకటేశ్‌, ఎర్ర శేఖర్‌, పటేల్ రమేష్ రెడ్డి, సత్తు మల్లేశ్‌ తదితరులు ఉన్నారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి నేతల ఆరోపణలను తిప్పికొట్టేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గం సిద్ధమైంది. ప్రధానంగా అసంతృప్తి నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే ఆయా నాయకుల వ్యాఖ్యలు పార్టీని ఏ విధంగా దెబ్బతీసేటట్టు ఉన్నాయో స్పష్టం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ను బలహీనపరిచే కుట్రకు అసంతృప్తి నేతలు తెరతీస్తున్నారనే దిశలో గట్టిగా స్పందించాలని రేవంత్‌ వర్గం భావిస్తోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి నష్ట నివారణ చర్యలు అధిష్ఠానం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు జోక్యం చేసుకుని అసంతృప్తి నేతలతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments