స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా
కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కి శ్రీకాంత్, తాటికాయల దిలీప్ అన్నారు గ్రామంలో సమస్యలపై ఎమ్మెల్యే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తోందని మండిపడ్డారు. పోలీసుల నిర్భంధంతో ప్రశ్నించే గొంతులను ఆపలేరని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అరెస్ట్ అయిన వారిలో నల్లబెల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటికాయల దిలీప్, వర్ధన్నపేట మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మరుపట్ల ప్రశాంత్, నల్లబెల్లి కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఆరెల్లి నాగరాజు ఉన్నారు.
ఎమ్మెల్యే పర్యటన.. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
RELATED ARTICLES
Recent Comments