నగరం కిటకిట..
కాంగ్రెస్ సభ ఎఫెక్ట్
భారీగా తరలివస్తున్న కాంగ్రెస్ శ్రేణులు
స్పాట్ వాయిస్, హన్మకొండ: నగరం కిటకిటలాడుతోంది. వాహనాల రద్దీ.. హారన్ మోతలతో ట్రై సిటీలు దద్దరిల్లిపోతున్నాయి. శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభ ఉండడంతో భారీగా కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, ప్రజలు తరలివస్తారు. కాంగ్రెస్ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభను విజయవంతం చేయడానికి శ్రమించారు. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చే నలుదిక్కులు.. వాహనాల క్యూనే కనిపిస్తున్నది. ప్రధాన సిటీలో పలు చోట్ల ట్రాఫిక్ జాం అయింది. సభకు సమయానికి ముందే నగర శివార్ల వరకూ వాహనాలు తట్టడంతో.. సభకు చేరుకోవడం కష్టంగా మారుతోంది.
Recent Comments