మీనాక్షి నటరాజన్ ను నియమించిన అధిష్టానం
స్పాట్ వాయిస్, బ్యూరో: కాంగ్రెస్ హైకమాండ్ పలు రాష్ట్రాల ఇంచార్జీలను మార్చుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా దీపాదస్ మున్షీ ఉండగా ఆమెను స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని బిర్లాగ్రామ్ నాగ్డాలో జన్మించారు. మీనాక్షి నటరాజన్ 2009 నుంచి 2014 వరకు మాండ్సౌర్ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. ఆమె 1999 నుంచి 2002 వరకు ఎన్ఎస్ యూఐ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008లో రాహుల్ గాంధీతో ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం మీనాక్ష నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా నియమించబడ్డారు. తెలంగాణాతోపాటు మణిపూర్, బీహార్, ఒడిస్సా, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జీలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
Recent Comments