Thursday, May 22, 2025
Homeతెలంగాణపార్లమెంట్ ఎన్నికలకు అబ్జర్వర్ల నియామకం

పార్లమెంట్ ఎన్నికలకు అబ్జర్వర్ల నియామకం

దూకుడు పెంచిన కాంగ్రెస్..
హస్తంలో అప్పుడే మొదలైన మరో ఎన్నికల సందడి..
స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ఉత్సాహంగా ముందుకుసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించడంతో అధికారంలో వచ్చిన హస్తం పార్టీ.. ఆ వేవ్ తగ్గకుండా.. మరింత ఊపు పెంచుకునేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్‌స‌భ‌కు పోటీ చేయించాల‌ని కాంగ్రెస్ పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ తీర్మానం చేసింది. అంతేకాదు.. తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలకు అబ్జర్వర్లు నియమించింది. ఇక ఇప్పటి నుంచే రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగేలా ఉంది.

పార్లమెంట్‌ నియోజకవర్గాల ఏఐసీసీ అబ్జర్వర్లు
వరంగల్‌ – రవీంద్ర దాల్వి
జహిరాబాద్‌ – మేయప్పన్‌
నాగర్‌కర్నూలు – పీవీ మోహన్‌
ఖమ్మం – ఆరీఫ్‌ నసీంఖాన్‌
నల్లగొండ – రాజశేఖర్‌ పాటిల్‌
పెద్దపల్లి – మోహన్‌ జోషి
మల్కాజ్‌గిరి – రిజ్వాన్‌ అర్షద్‌
మెదక్‌ – యూబీ వెంకటేశ్‌
సికింద్రాబాద్‌ – రూబీ మనోహరన్‌
హైదరాబాద్‌ – భాయ్‌ జగదప్‌
భువనగిరి – శ్రీనివాస్‌
మహబూబాబాద్‌ – శివశంకర్‌రెడ్డి
ఆదిలాబాద్‌ – ప్రకాశ్‌ రాథోడ్‌
నిజామాబాద్‌ – అంజలీ నింబాల్కర్‌
మహబూబ్‌నగర్‌ – మోహన్‌ కుమార్‌ మంగళం
చేవెళ్ల – ఎం.కె. విష్ణుప్రసాద్‌
కరీంనగర్‌ – క్రిస్టోఫర్‌ తిలక్‌

RELATED ARTICLES

Most Popular

Recent Comments