Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలుకాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో..

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో..

కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

 జాతీయ రహదారిపై నిలిచిన వాహనాలు

 స్పాట్ వాయిస్ నర్సంపేట: ఖానాపూర్ మండలంలోని బుధరావుపేటలో 365 జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. రైతులకు రుణమాఫీ అమలు చేయాలని, అకాల వర్షానికి ఇటీవల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే అందజేయాలని, నాణ్యమైన 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సందర్భంగా జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రాస్తారోకో విరమింపజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments