దమ్ముంటే మీ పేరుతో పోస్టర్లు వేయ్..
డీసీసీ అధ్యక్షుడు నాయిని
మాకు ఆ అవసరం లేదు..
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం
ఓరుగల్లులో పోస్టర్ల కలకలం..
స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: హన్మకొండ నగరంలో పోస్టర్లు కలకలం రేపాయి. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రాజేందర్‌రెడ్డి కబ్జాలు, అక్రమాలకు పాల్పడ్డారని పోస్టర్లలో ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు కాజేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉన్న వాల్ పోస్టర్లు గుర్తు తెలియని వ్యక్తుల పేరిట వెలిశాయి. ఈ పోస్టర్లపై డీసీసీ అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోవర్టులు, ఎమ్మెల్యే అనుచరులే పోస్టర్లు వేశారని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. ‘బ్రోకర్ బతుకులు మార్చుకోండి.. దమ్ముంటే మీ పేరుతో పోస్టర్లు వేయాలి’ అని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ కు రాజేందర్‌రెడ్డి సూచించారు. పోస్టర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే రాజేందర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ స్పందించారు. కోవర్టులను పెట్టుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలపై పోస్టర్లు వేసి చిల్లర రాజకీయాలు చేయబోమని చెప్పారు. ధర్మబద్ధంగానే కొట్లాడతామన్నారు. కాంగ్రెస్ నేతలు దిగజారుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.
Recent Comments