వరద బాధితులకు సహాయం అందించాలి
కాంగ్రెస్ ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ నరుకుడు వెంకటయ్య
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా చైర్మన్ నరుకుడు వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో నష్టపోయి అప్పుల పాలైన రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. వరదలతో పంటలు మునిగి మూడు వారాలు గడుస్తున్న రైతులకు నేటికీ పరిహారం ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు, వరద నష్టంపై సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర ధరలు, జీఎస్టీ పెంపుదల, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పూర్తిగా నష్టపోయిన వారికి రూ.10 లక్షలు, తాత్కాలికంగా నష్టపోయిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వరద బాధితులకు సహాయం అందించాలి
RELATED ARTICLES
Recent Comments