సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
స్పాట్ వాయిస్, గణపురం:మండలంలోని కర్కపల్లి గ్రామానికి చెందిన కే.శ్రీలతకు సీఎం సహాయనిధి నుంచి రూ. 18 వేలు మంజూరయ్యాయి. ఇందుకు సంబందించిన చెక్కును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశం మేరకు ఆదివారం సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోట్ల నగేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొలసాని లక్ష్మీనరసింహారావు, గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పుర్ణచంద్రారెడ్డి లబ్ది దారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు పోట్ల కిష్టయ్య, ఉప సర్పంచ్ అనగాని మల్లేశ్, యూత్ అధ్యక్షుడు పోట్ల భరత్ తదితరులు ఉన్నారు.
Recent Comments