Saturday, April 5, 2025
Homeతెలంగాణనేటి సీఎం పర్యటన రద్దు..

నేటి సీఎం పర్యటన రద్దు..

నేటి సీఎం పర్యటన రద్దు..

రేపు యథావిధి.. షెడ్యూల్ 

 స్పాట్ వాయిస్, వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం ఢిల్లీ లో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. శుక్రవారం కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో భేటీ కావాల్సి ఉండగా.. వరంగల్ పర్యటనను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కేబినెట్ విస్తరణతో పాటు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయంపై నేడు కూడా కీలక భేటీ ఉండనుందని.. అందుకు పర్యటన వాయిదా పడిందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా.. పలువురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలపై భేటీ అవుతున్నారు. తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలతో పాటు.. పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చిస్తున్న విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments