Saturday, June 7, 2025
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం..

స్పాట్ వాయిస్, బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ లోని నోవాటెల్​లో జరుగుతున్న కాంగ్రెస్ సీఎల్పీ సమావేశానికి వెళ్తున్న క్రమంలో హోటల్‌ లిఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. సీఎం అందులోనే ఉండటంతో అందరూ టెన్షన్ పడ్డారు. ఓవర్ వెయిట్ తో లిఫ్ట్‌ ఆగాల్సిన చోటుకంటే రెండు అడుగులు కిందకు దిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సహా అధికారులు, సిబ్బంది ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు అయోమయానికి గురయ్యారు. అనంతరం పెద్ద ప్రమాదం ఏమీ లేదని తెలుసుకుని లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మరో లిఫ్ట్‌లో ముఖ్యమంత్రిని అధికారులు తరలించారు. పైఅంతస్తుకు వెళ్లే క్రమంలో 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో రేవంత్ రెడ్డితోపాటు 13 మంది ఎక్కారు. దీంతో లిఫ్ట్ ఉండాల్సిన స్థానం కంటే కిందికి కుంగిపోయింది. వెంటనే అలారం మోగడంతో అధికారులు, హోటల్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన లిఫ్ట్ వద్దకు పరుగులు పెట్టారు. అనంతరం సీఎం సహా అందరినీ లిఫ్ట్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం మరో లిఫ్ట్‌లో సమావేశం జరుగుతున్న సెకండ్ ఫ్లోర్‌కు తీసుకెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments