‘ముందస్తు’ ధైర్యం ఉందా..!
నేను రెడీ.. మీరు రెడీనా..
డేట్ ఫిక్స్ చేయండి.. తేల్చుకుందాం..
ప్రజలు తమను ఎప్పుడైనా ఆశీర్వదిస్తరు..
అధికారం కోసం ఏక్ నాథ్ షిండేలు అవసరమా..
సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని.. ఒడించేది, గెలిపించేది ప్రజలని, వ్యక్తులు కాదని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని విపక్షాలు ముందస్తుకు సిద్ధమైతే తాను కూడా అసెంబ్లీని రద్దు చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై స్పందించారు. తేదీ ఖరారు చేస్తే.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తామని విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. అధికారం కోసం ఏక్‌నాథ్ శిందేలను పుట్టించాలా? అని బీజేపీని నిలదీశారు. . మున్ముందు ఏక్‌నాథ్ శిందేలే ఏకుమేకవుతారని తనదైన శైలిలో హెచ్చరించారు. తాము కుంభకోణాలు చేయలేదని.. ప్రజల కోసం మంచి పనులు చేశామన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్తే జనాలే తమను గెలిపిస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Recent Comments