Friday, May 30, 2025
Homeతెలంగాణసీఎం కేసీఆర్ కు అల్సర్..

సీఎం కేసీఆర్ కు అల్సర్..

సీఎం కేసీఆర్ కు అల్సర్..

వెల్లడించిన ఏఐజీ ఆస్పత్రి

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్​ ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన గచ్చిబౌలిలో ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కేసీఆర్​కు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. సీఎం కేసీఆర్ కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. ఆస్పత్రిలో గ్యాస్ట్రిక్ సంబంధిత పరీక్షలు చేసినట్లు ఏఐజీ ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగాధిపతి డి.నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎండోస్కోపి, పొత్తి కడుపుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లు గుర్తించామన్నారు.దాదాపు ఏడు గంటలపాటు ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్ అనంతరం తిరిగి ప్రగతిభవన్​కు బయలుదేరి వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments