వీఆర్ఏలపై సీఎం కేసీఆర్ ఫైర్
స్పాట్ వాయిస్, బ్యూరో: వీఆర్‌ఏ సంఘం నేతలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలంటూ వారు సీఎం కేసీఆర్ కి వినతి పత్రం అందించగా.. వీఆర్‌ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే కేసీఆర్ విసిరివేశారు. డ్రామాలాడుతున్నారంటూ.. వీఆర్‌ఏ సంఘం నేతలపై మండిపడ్డారు. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన్ని వీఆర్‌ఏ సంఘం నాయకులు కలువగా.. ఈ విధంగా స్పందించారు. ఈ పరిణామంతో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదిలా వుండగా అంతకుముందు జనగామ వద్ద సీఎం కేసీఆర్‌కు వీఆర్ఏల నుంచి నిరసన సెగ తగిలింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు వీఆర్ఏలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల ఆందోళనలతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
డ్రామాలాడుతున్నారు.. !
RELATED ARTICLES
Recent Comments