శరత్ బాబు కన్నుమూత
స్పాట్ వాయిస్, సినిమా డెస్క్ : తెలుగు సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుముశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మొదట చెన్నై, బెంగళూరులో చికిత్స తీసుకున్న ఆయన.. మెరుగైన వైద్యం కోసం నెల రోజుల క్రితం.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీలో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి శరత్ బాబు వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. శరత్ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదా ఛాయలు అలుముకున్నాయి.
సత్యనారాయణ దీక్షితులు..
శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. 1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు.. దక్షిణాదిన అన్ని భాషల్లో నటించారు. రామరాజ్యంలో చిత్రంలో తొలిసారి తెరపై కనిపించారు శరత్ బాబు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. ఇక శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు.
Recent Comments