Sunday, September 22, 2024
Homeక్రైమ్హోటల్లోకి దూసుకెళ్లిన సీఐ కారు..

హోటల్లోకి దూసుకెళ్లిన సీఐ కారు..

హోటల్లోకి దూసుకెళ్లిన సీఐ కారు..

పాలకుర్తి సీఐకి తప్పిన ప్రమాదం

స్పాట్ వాయిస్ , పాలకుర్తి : పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి దంపతులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ కు హాజరై తిరిగి వస్తుండగా ఆదివేముల వద్ద ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఓ హోటల్లోకి సీఐ కారు దూసుకెళ్లినట్లు సమాచారం. రాత్రి 1:30 సమయంలో సీఐ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకునట్లు తెలుస్తోంది. సీఐ కి గాయాలు కాగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చికిత్స నిమిత్తం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో తరలించారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మహబూబాబాద్ స్పెషల్ బ్రాంచీ ఎస్సై విజయ్ రామ్ కుమార్ కు తీవ్ర గాయాలు

ఖమ్మం రూరల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ నుంచి ఖమ్మం వస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది.కారులో ఉన్న మహబూబాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సై విజయ్ రాంకుమార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తీవ్రంగా గాయపడిన విజయ్ రాంకుమార్ ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు…. రెండు రోజుల క్రితమే సీరోలు నుండి బదిలీ అయ్యారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments