Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలుబాలుడి ప్రాణం తీసిన చాక్లెట్..

బాలుడి ప్రాణం తీసిన చాక్లెట్..

గొంతులో ఇరుక్కుని బాలుడి మృత్యువాత
వరంగల్ లో విషాదం
స్పాట్ వాయిస్, వరంగల్ : గొంతులో చాక్లెట్ ఇరుక్కొని ఊపిరిడాక ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనతో వరంగల్ లో విషాదం నెలకొంది. వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ చాలా ఏళ్ల క్రితం వరంగల్ కు వచ్చి ఎలక్ట్రికల్‌ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. స్థానిక శారద పబ్లిక్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న అతడి కుమారుడు సందీప్ (8) శనివారం స్కూల్ కు వెళ్తుండగా ఆస్ర్టేలియా నుంచి తీసుకొచ్చిన చాక్లెట్‌ను ఇచ్చాడు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అయితే అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి వెంటనే వరంగల్‌ ఎంజీఎం కు తరలించారు. గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments