Monday, November 18, 2024
Homeతెలంగాణతోకతో పుట్టిన బాలుడు..

తోకతో పుట్టిన బాలుడు..

తోకతో పుట్టిన బాలుడు..

తొలగించిన డాక్టర్లు 

స్పాట్ వాయిస్, బ్యూరో :యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు. రాష్ట్రానికి చెందిన ఓ దంపతులకు తొమ్మిది నెలల క్రితం తోకతో బాబు పుట్టగా ఈ ఏడాది జనవరి నెలలో బాబును తల్లిదండ్రులు ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి.. గర్భం దాల్చే సమయంలో సమస్య తలెత్తి స్పైనల్‌ కార్డ్‌ సరిగా ఏర్పడక బాబు తోకతో జన్మించాడని వైద్యులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న నిమ్స్‌ వైద్యులు జనవరిలో చిన్న పిల్లల వైద్య విభాగం సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ శశాంక్‌ పండ నేతృత్వంలో రెండున్నర గంటలకు పైగా శ్రమించి 15 సెంటీమీటర్ల పొడవున్న ఆ తోకను బాబు శరీరం నుంచి వేరు చేశారు. ఐదు రోజుల పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితులను గమనించిన అనంతరం డిశ్చార్జ్‌ చేశారు. ఆరు నెలలుగా బాబును పర్యవేక్షించిన వైద్యులు సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి బాబుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని నిర్ధారించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments