స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని సీతారాంపురం గ్రామంలో జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. చల్వాయి గ్రామానికి చెందిన అమ్మాయి (15), ములుగు జిల్లా వాజేడు గ్రామానికి చెందిన అబ్బాయికి మండల పరిధిలోని సీతారాంపురం గ్రామంలో వివాహం నిర్వహించారు. బాల్య వివాహం జరుగుతోందనే సమాచారం మేరకు తహసీల్దార్ రియాజుద్దిన్ ఆత్మకూరు సబ్ ఇన్‌స్పెక్టర్ గణేష్ తో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దీంతోఅమ్మాయి వయసు 15 ఏళ్లుగా తేలింది అమ్మాయి, అబ్బాయిని బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం అని, బాల్య వివాహాలకు ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Recent Comments