Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్బిందెలో ఇరుక్కున్న బాలుడి తల..

బిందెలో ఇరుక్కున్న బాలుడి తల..

స్పాట్ వాయిస్ , మహబూబాబాద్: జిల్లాలో నెల్లికుదురు మండలం కాచికల్లు గ్రామంలో బాబు తల బిందెలో ఇరుక్కుపోయింది. గ్రామానికి చెందిన వెంకన్న-భవానీ దంపతులకు మూడేళ్ల కొడుకు రిశాంత్ ఉన్నాడు. తల్లి భవానీ ఇంట్లో పని చేసుకుంటుండగా బాబు బయట కనిపించిన బిందెతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బిందెలో తలపెట్టాడు. అందులోనే తల ఇరుక్కుపోయి ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. పిల్లాడు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన తల్లి పరుగునా వచ్చింది. బిందెలో తల ఇరుక్కుపోవడం గమనించి బాలుడి తలను తీయడానికి ప్రయత్నించింది. ఎంతకి రాకపోవడంతో భర్తను పిలిచింది. అతడు కూడా కుమారుడి తలను బిందెలో నుంచి తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.దీంతో కట్టర్ సాయంతో బిందెను కోసి బాలుడి తలను బయటకు తీశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments