భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య..
స్పాట్ వాయిస్ , డెస్క్: భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన రతన్‌లాల్(32) రాధిక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారు. దుండిగల్‌లో అద్దెకు ఉంటున్నారు. రతన్‌లాల్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. గత శుక్రవారం సాయంత్రం రతన్‌లాల్ మద్యం తాగి.. చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. వెంటనే కోడికూర వండాలని భార్యను ఆదేశించాడు. భార్య నిరాకరించింది. దీంతో మత్తులో ఉన్న రతన్‌లాల్‌కు భార్యతో గొడవ పడ్డాడు. కోపంతో బయటకు వెళ్లిపోయి శనివారం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మహబూబ్‌నగర్‌లో ఉన్న తల్లికి ఫోన్ చేశాడు. వెంటనే యాసిడ్ తాగేశాడు. బాధ భరించలేక ఇంటికొచ్చి యాసిడ్ తాగినట్టు కుటుంబసభ్యులకు తెలిపాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.
Recent Comments