స్పాట్ వాయిస్, హన్మకొండ టౌన్: హన్మకొండ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం , మార్కజీ స్కూల్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేఏసీ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ బహుజనుల కోసం పోరాటం చేశారన్నారు. కానీ చరిత్రని వక్రీకరించి ఒక వర్గానికి మతానికి నాయకుడిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన సైన్యంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలను, అన్ని మతాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించి సమాన హక్కులు ఇచ్చిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్, ప్రెసిడెంట్ టి. రాజేశ్వరరావు , అభయాస్త ఫౌండేషన్ ప్రెసిడెంట్ టీ. కార్తిక్, తాపీ మేస్త్రీ సంఘం అధ్యక్షుడు రవీందర్ , మూగల రఘువీర్, తెలంగాణ టు వీలర్స్ అసోసియేషన్ వరంగల్ ప్రెసిడెంట్ పీవీ చారి, సీపీఎం లీడర్ శ్రీను,బీఎస్పీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ గారు, ముక్తార్, నబి తదితరులు పాల్గొన్నారు.
Recent Comments