Saturday, September 21, 2024
Homeక్రీడలుటుడే మ్యాచ్... చెన్నై vs కోల్కతా..

టుడే మ్యాచ్… చెన్నై vs కోల్కతా..

స్పాట్ వాయిస్, స్పోర్ట్స్ : చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం రాత్రి తొలి మ్యాచ్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో జరిగే ఈ పోరులో ఎవరు బోణీ కొడుతారోనని క్రికెట్ లవర్స్ వేచి చూస్తున్నారు. ఈ రెండు టీమ్స్ ఈసారి కొత్త కెప్టెన్లతో బరిలో దిగుతున్నాయి. సీజన్ కు రెండు రోజుల ముందే కెప్టెన్ గా ధోనీ తప్పుకోగా.. జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. ఇక గతేడాది ఇంగ్లండ్ ప్లేయర్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలో ఫైనల్ వరకు వెళ్లిన కేకేఆర్.. ఈసారి అతడిని వేలానికి ముందే వదిలేసింది. ఆ తర్వాత వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ను తీసుకుని అతడికి కెప్టెన్సీ అప్పగించింది. రాత్రి 7.30 నుంచి స్టార్​ స్పోర్ట్స్​లో మ్యాచ్ ప్రసారం కానుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments