స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: వర్ధన్నపేట పురపాలక సంఘంలో ఆదివారం చేపట్టిన 4వ విడత పట్టణ ప్రగతి వరంగల్ అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9వ వార్డులోని ప్రజలకు తడిపొడిచెత్త వేరు చేసే విధానం, ఇంకుడు గుంతల ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంట్లో ఉండే చెత్త బయటి ప్రదేశాల్లో వేయకుండా మున్సిపాలిటీ వాహనంలో మాత్రమే వేయాలని చెప్పారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ అంగోతు అరుణ, కమిషనర్ గొడిశాల రవీందర్ , వార్డు కౌన్సిలర్లు మంచాల రామకృష్ణ ,తుమ్మల రవీందర్ , వార్డు ఇంచార్జ్లు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిని తనిఖీ చేసిన వరంగల్ అడిషినల్ కలెక్టర్
RELATED ARTICLES
Recent Comments