Saturday, November 23, 2024
Homeటాప్ స్టోరీస్మాజీ సీఎం చంద్రబాబుకు రిమాండ్

మాజీ సీఎం చంద్రబాబుకు రిమాండ్

14 రోజుల జుడీషియల్ రిమాండ్
స్పాట్ వాయిస్, బ్యూరో: ఏపీ రాజకీయాల్లో తీవ్ర పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.  చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బ‌ృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బ‌ృందం సుదీర్ఘ వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. చంద్రబాబుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబును రాజమండి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. రిమాండ్ నేపథ్యంలో చంద్రబాబు లాయర్లు మరికాసేపట్లో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉండగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రాథమిక ఆధారాలతోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. రూ.271 కోట్ల స్కామ్‌ జరిగిందని, అందులో చంద్రబాబు పాత్ర ఉందని పేర్కొంది. కాగా.. అరెస్ట్ విషయంలో సుమారు 8 గంటలపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్ విజయవాడ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments