అరంగంటలోనే పట్టుకున్న సీసీఎస్ పోలీసులు
స్పాట్ వాయిస్, క్రైమ్ : గొలుసు దొంగతనం చేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. హన్మకొండ పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హన్మకొండ కుమార్ పల్లికి చెందిన మహిళ మెండి లక్ష్మి ఈ నెల 20న ఉదయం 12:15 గంటల సమయంలో సమీపంలోని కూరగాయల దుకాణం నుంచి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు వచ్చి ఆమెను ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమె ఒంటిపైనున్న 3 తులాల ఓ బంగారు గొలుసు, ఒకటిన్నత తులాలున్న పతకం.. మొత్తం విలువ రూ.3,50,000 విలువువైన బంగారు ఆభరణాలను తీసుకుని పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ బృందాలు నిందితుడి కోసం గాలించాయి. కేవలం అరగంటలోనే చైన్ స్నాచర్ వినయ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు.
Recent Comments