Saturday, November 23, 2024
Homeకెరీర్ఆ సర్టిఫికెట్ ఇక లైఫ్ టైం వ్యాలిడిటీ

ఆ సర్టిఫికెట్ ఇక లైఫ్ టైం వ్యాలిడిటీ

ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు
జూన్ లో టెట్ ఎగ్జామ్..!
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్‌)లో ఒక్కసారి అర్హత సాధిస్తే సర్టిఫికెట్ కు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. 2011 ఫిబ్రవరి 11న విడుదల చేసిన మార్గదర్శకాల అనంతరం టెట్‌ అర్హత సాధించిన వారికి కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం టెట్‌ సర్టిఫికెట్‌ గడువు ఏడేండ్లు. టీఎస్‌ టెట్‌ అర్హత ఎప్పటికీ వర్తించేలా సవరిస్తూ బుధవారం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. టెట్‌ నిబంధనలు సవరించడంతో టెట్‌ నిర్వహణకు అనుమతిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో 7ఏళ్లు
గతంలో టెట్‌ వ్యాలిడిటీ 7 సంవత్సరాలు ఉండేది. టెట్‌ రాయడానికి ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు 45శాతం మార్కులు అవసరం. కాగా.. టెట్‌ను జూన్‌లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. మే నెల చివరి వారం లేదా జూన్‌ మొదటి వారంలో పరీక్ష జరిగే అవకాశం ఉంది. మే చివరివారం నుంచి జూన్‌ 1వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే టెట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. టెట్‌ ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments