నాలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దు.. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నరకం చూపిస్తున్నారు.
నా చావుకు నా భర్త.. అత్తమామలే కారణం.
నా కష్టాలు తీర్చాలని పోలీసుల చుట్టూ తిరిగిన. ఎవరూ పట్టించుకోలేదు. చివరకు మహిళా పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడి సీఐ డబ్బులు తీసుకొని నా సమస్యను పక్కన పెట్టారు.. అంటూ కన్నీళ్లతో ఓ యువతి సూసైడ్ కు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
ఖానాపూర్ మండల కేంద్రానికి చెందిన శ్యామ శరత్ అనే యువకుడు, నూర్జహాన్ అనే యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మేజర్ అయ్యే వరకు ఆగి పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వీరికి పెద్దల నుంచి బెదిరింపులు రావడం తో నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు కుల తిరస్కారాలు, కొట్లాటల మధ్య కొనసాగిన దాంపత్యం పంచాయితీల కాపురంగానే సాగుతోంది. ఈ క్రమంలో యువకుడి తల్లిదండ్రులు కులం పేరుతో శరతన్ అమ్మాయికి దూరం చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీనిని యువకుడు సైతం సమర్థించడం, కట్నం కోసం వేధింపులు మొదలు పెట్టడం తో యువతి మళ్లీ పోలీసులను ఆశ్రయించింది అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో.. మనస్తాపం చెందిన అమ్మాయి మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు యత్నించింది. ఈ క్రమంలో తనను అత్త, మామ, బావ, ఆడ పడచు కులం పేరుతో వేధిస్తున్నారని.. . వరకట్నం కోసం ఇబ్బందులు పెడుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుంది. పోలీసులు కూడా న్యాయం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్ళినా న్యాయం జరగలేదని కన్నీరు పెట్టుకుంది. తనలాగా మరో అమ్మాయికి జరగకూడదని తాను చనిపోతున్నానని విలపిచింది.
ఎంజీఎం లో…
కోటగండి సమీపంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న యువతిని స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం కు తరలించారు. కాగా నూర్జహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం .
Recent Comments