నా ఫోన్ పోయిoది…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
స్పాట్ వాయిస్, బ్యూరో: సెల్‌ఫోన్ ఎక్కడో పడిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఈనెల 5న ఆయన ఇంటి వద్ద పోలీసులు సంజయ్‌ను అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఇందులో భాగంగానే మొబైల్ పోయినట్లు ఆయన కరీంనగర్ రెండో పట్టణ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపారు. ఇది ఇలా ఉంటే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాన్ని తేల్చడానికి పోలీసులు బండి సంజయ్ తన మొబైల్‌ను.. తమకు అప్పగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో దీనిపై వివాదం నెలకొంది. ఇటీవల బండి సంజయ్‌ను పరామర్శించడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సైతం.. ఆ ఫోన్‌ను పోలీసులే తీసుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.
Recent Comments