వేడుకలు ప్రశాంతoగా జరుపుకోవాలి
ఎస్సై కొంక అశోక్
స్పాట్ వాయిస్, దామెర: ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని ఎస్సై కొంక అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ప్రజానీకం సిద్దమైనందున, టూ వీలర్, ఆటో-రిక్షా, ఫోర్ వీలర్ డ్రైవర్లు తప్పనిసరిగా డాక్యుమెంట్స్ ని అందుబాటులో ఉంచుకొని నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్లు, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్‌లెస్ రైడింగ్ చేసేవారిని ప్రత్యేక కెమెరాల ద్వారా గుర్తిస్తామన్నారు. కొత్త సంవత్సరం వేడుకల వేళ సంయమనం అవసరమని, హద్దుమీరితే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారికి, జరిమానా విధించాల్సి ఉంటుందని, డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో ఉందన్నారు. యువత కూడా అర్ధరాత్రి బయటకు రాకుండా కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవాలని దామెర ఎస్సై కొంక. అశోక్ తెలిపారు.
Recent Comments