దామెర ఎస్సై కొంక అశోక్
స్పాట్ వాయిస్, దామెర: మండలంలోని అన్ని గ్రామాల ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఎస్సై కొంక అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శనివారం నిర్వహించుకునే దసరా (విజయదశమి) పండుగను మండల ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గ్రామాల్లో దసరా నిర్వహించే సమయంలో, గ్రామ ప్రత్యేక అధికారులకు, పోలీసులకు ప్రజలు సహకరించాలని, దుర్గాదేవి నవరాత్రి ముగింపు, శోభాయాత్ర ల్లో డీజేలకు అనుమతి లేదన్నారు. ఒకవేళ డీజే లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రామాల్లో టపాకాయలు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదైనా ఘర్షణ జరిగితే వెంటనే డయల్ 100 కానీ, పోలీస్ స్టేషన్ ఎస్సై నంబర్ 8712685228, 8897157403 గాని, పోలీస్ స్టేషన్ నంబర్ 8712685020 కు సమాచారం అందించాలని కోరారు.
ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
RELATED ARTICLES
Recent Comments