వృద్ధ దంపతులకు షష్టిపూర్తి మహోత్సవం..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: అతడికి 99.. ఆమెకు 92 ఏళ్ళు..ఎంతో అన్యోన్యంగా ఉంటున్న ఆ వృద్ధ దంపతులకు ఆదివారం మనవండ్లు, మనవరాండ్లు షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందుకు మానుకోట జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల గ్రామము వేదికైంది.. గ్రామానికి చెందిన
బైరి వీరయ్య -లచ్చమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు.. అలాగే 11 మంది మనవండ్లు, మనవరాండ్లు వున్నారు. ఆదివారం కుటుంబ సభ్యులంతా కలిసి ఏళ్లుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్న వృద్ధ దంపతులకు ఘనంగా షష్టి పూర్తి మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కానుకలు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు.. అందరూ కలిసి మెలసి భోజనాలు చేసారు.ఈ వేడుకతో
గ్రామంలో సందడి నెలకొంది.
Recent Comments