నా పేరు ఎఫ్ఐఆర్లో లేదు..
సీబీఐని కలవలేను
ఎమ్మెల్సీ కవిత
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ , ఫిర్యాదు ఉన్నట్లు సీబీఐ తెలిపిందన్నారు. ఎఫ్ఐఆర్, నిందితుల జాబితా, ఫిర్యాదును పరశీలించానని.. అందులో తన పేరు లేదని.. రికార్డెడ్‌గా చెప్పాలనుకుంటున్నట్టు కవిత పేర్కొన్నారు. ఈ నెల 6న సీబీఐని కలవలేనన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల.. సీబీఐ అధికారులను కలిసే అవకాశం లేదన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని కవిత పేర్కొన్నారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. తాను చెప్పిన తేదీల్లో ఎప్పుడైనా సీబీఐ రావొచ్చన్నారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని లేఖలో కవిత పేర్కొన్నారు.
Recent Comments