Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుకులవృత్తులకు సర్కారు చేయూత

కులవృత్తులకు సర్కారు చేయూత

కులవృత్తులకు సర్కారు చేయూత
గొర్రెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అరూరి

స్పాట్ వాయిస్ హన్మకొండ రూరల్: కుల వృత్తులకు చేయూతను అందించి తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశయమని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.ఆదివారం
ఐనవోలు మండలం పంథిని గ్రామంలో రాష్ట్ర గొర్రెలు,మేకల అభివృద్ధి సమాఖ్య కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు తో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ రెండో విడత 130యూనిట్లకు ఆదివారం 5యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. కుల వృత్తులను ప్రోత్సహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీ పై గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. గొర్రెల కాపరుల మందలు వృద్ధి చెందడం వల్ల ప్రస్తుతం వారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.రాష్ట్ర గొర్రెలు,మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ.. టిఆరెస్ ప్రభుత్వ పాలనలో కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారు వారి కులవృత్తులు చేసుకుంటూ ఆత్మభిమానంతో జీవిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు,జెడ్పీ కో-ఆప్షన్ మెంబర్ ఉస్మాన్ అలీ,సర్పంచ్ ప్రేమలత,మండల రైసస కోఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

Recent Comments