Monday, November 25, 2024
Homeజిల్లా వార్తలుస్వరాష్ట్రంలో అన్ని మతాలకు కేసీఆర్ ప్రాధాన్యం

స్వరాష్ట్రంలో అన్ని మతాలకు కేసీఆర్ ప్రాధాన్యం

ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి
స్పాట్ వాయిస్, గణపురం: టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని, గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నారే తప్ప వారి అభ్యున్నతికి పాటు పడలేదని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం రంజాన్ సందర్భంగా వరంగల్ జిల్లా గూడెప్పాడ్ గ్రామానికి చెందిన సిరికొండ వీరాభిమాని ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో మంగళవారం ఎమ్మెల్సీ సిరికొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిరికొండ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి విశేష కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పేద ప్రజలు తమ పండుగలను ఎన్నడూ సంతోషంగా జరుపుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ గొప్ప మనసుతో నిరుపేదలందరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments