Wednesday, April 9, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
కోర్టుకు చేరిన మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం
స్పాట్ వాయిస్, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల‌ కొనుగోలు అంశంపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించాలని బీజేపీ కోరింది. ఎనిమిది మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం, డీజీపీ, సైబారాబాద్‌ సీపీ, రాజేంద్రనగర్‌ ఏసీపీ, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌వో, కేంద్రం, సీబీఐని ప్రతివాదులుగా బీజేపీ చేర్చింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపై కమలం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలని హైకోర్టును బీజేపీ కోరింది. కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనల్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments