Saturday, April 5, 2025
Homeసినిమాసినీ నటులు జీవిత, రాజశేఖర్‌ దంపతులకు ఏడాది జైలు శిక్ష..

సినీ నటులు జీవిత, రాజశేఖర్‌ దంపతులకు ఏడాది జైలు శిక్ష..

సినీ నటులు జీవిత, రాజశేఖర్‌ దంపతులకు ఏడాది జైలు శిక్ష..

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : పరువునష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్‌ దంపతులకు నాంపల్లి 17వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ (ఏసీఎంఎం) కోర్టు ఏడాది జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దాతల నుంచి సేకరించిన రక్తాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. దీంతో జీవిత, రాజశేఖర్ పై నిర్మాత అల్లు అరవింద్ పరునష్ట దావా వేసారు.సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జీవిత,రాజశేఖర్ కు ఏడాది జైలు శిక్ష 5 వేల జరిమాన విధించారు. అప్పిలుకు వెళ్లి వెళ్లేందుకు సమయం ఇస్తూ నాంపల్లి కోర్టు బెయిల్ మంజురు చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments